హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధరణమైన అనారోగ్యపు సమస్యగా మారింది. అందుకు కారణం ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమప్య పైల్స్‌. సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది. నీరు తక్కువగా త్రాగడం, మద్యం అధికంగా సేవించుటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం వలన పైల్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటి వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడుతున్నారు.

 

అధిక బరువు, తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సాధారణ సమస్యలతో పాటు మరొకటి పైల్స్. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాదే అయినప్పటికి, జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతున్నాయి. హెమరాయిడ్స్‌ని సామాన్య పరిభాషలో పైల్స్ అంటారు. తెలుగులో వీటిని మొలలు అని పిలుస్తారు. 

 

పైల్స్  యొక్క లక్షణాలు:

మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి. ఒకసారి వస్తే చాలాకాలంపాటు వేధించే సమస్య ఇది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారం, కూర్చుని చేసే ఉద్యోగం- ఈ వ్యాధికి కారణం అవుతాయి. మనుషులు చురుకుగా ఉండలేరు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

 

పైల్స్ నివారణకు 8 ఆహారాలు మరియు వ్యాయామం:

ఫైల్స్ సమస్య నుండి బయట పడాలంటే చాలా పద్దతులే ఉన్నాయి. అయితే అవి వారి వారి ఆరోగ్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డాక్టర్ ను సంప్రధించి మెడిసిన్ తీసుకోవల్సి ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా సహజ పద్దతుల్లో పైల్స్ ను నివారించుకోవచ్చు. అయితే, కింద సూచించిన 8 ఆహార పదార్ధాలు చాల బాగా పైల్స్ ని అరికడతాయి. 

  • దానిమ్మ: హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోరెమడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి.

దానిమ్మ

  • ముల్లంగి రసం: పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.
  • అల్లం -నిమ్మరసం జ్యూస్: పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి.

  • ఫిగ్(అంజీర పండు): అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. ఆ నీటిని సగభాగం ఉదయం, సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
  • పచ్చి ఉల్లిపాయ: పైల్స్, మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్ ను తగ్గిస్తుంది.
  • అరటి పండు: అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినండి.

  • సోయా బీన్స్: బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి.
  • పసుపు: పసుపుల అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంది. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపుకొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని బాగా తాగాలి.

 

పైన సూచించిన 8 ఆహారాలతో పాటు, వ్యాయామం కూడా పాటిస్తే మీరు పైల్స్  నుండి చాల త్వరగా కోలుకోవచ్చు. 

  • వ్యాయామం: మలబద్దకం నివారించడానికి మరియు శరరంలో క్రమంగా రక్త ప్రసరణ జరగడానికి రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుంది. అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ బరువులను మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ అధికంగా కావచ్చు. కాబట్టి సాధారణ వ్యాయమం మరియు వాకింగ్ వంటివి అలవాటు చేసుకోండి.

 

ఏదైనా సందర్భంలో, పైన సూచించిన ఆహారాలతో మీ పైల్స్ నయం అవకపోతే, పైల్స్ స్పెషలిస్ట్‌ను [Piles Specialists] సంప్రదించండి. వారు,  మీ పైల్స్ యొక్క తీవ్రత ఆధారంగా మీకు సరిపడే శస్త్రచికిత్సను సిఫారసు చేయవచ్చు. మపైల్స్ సర్జరీ చేయించుకుందాం అని అనుకుంటే, Pristyn Care కి రండి. మా వద్ద పైల్స్కి సమబందించిన ప్రత్యేకమైన వైద్యులు ఉన్నారు. మేము లేసర్ టెక్నిక్ ని వాడి, మీ పిల్స్ వ్యాధిని చేస్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *